విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. ఈ సారి కరోనా కంటే డేంజర్ డేస్ వస్తాయంటున్న నిపుణులు

by Disha Web Desk 10 |
విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. ఈ సారి కరోనా కంటే డేంజర్ డేస్ వస్తాయంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్: కరోనా సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం చాలా మందికి తెలిసిందే. మనుషులను నాశనం తప్ప మంచి లేదు అన్నట్టు ఉంది. నిన్న మొన్నటి వరకు కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గజ గజ వణికించింది. అయినప్పటికీ, ఇంకా అది మనల్ని వీడి పోలేదు. ఇప్పుడు దీనికంటే, పెద్ద మహమ్మారి ముంచుకొచ్చేస్తోంది. ఇది అయితే కోవిడ్ కంటే చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.

బర్డ్ ఫ్లూ.. గురించి అందరూ వినే ఉంటారు. ప్రస్తుతం జనం ఈ పేరు వింటేనే భయపడిపోతున్నారు. ఇది అమెరికాలో పుట్టి నెమ్మదిగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ క్లిష్టస్థాయికి చేరుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఇది పక్షుల్లో మాత్రమే కనిపించింది కానీ ఇప్పుడు ఇది క్షీరదాలు, మానవులకు కూడా సోకుతుంది. బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిన వారిలో సగం మంది చనిపోతారని బర్డ్ ఫ్లూ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇది ఎప్పుడైనా రావొచ్చు. జంతువుల్లో, మనుషుల్లో ఇది వ్యాపించేసిందని అంటున్నారు. ఈ వైరస్‌తో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, H5N1 బర్డ్ ఫ్లూ సోకిన 100 మందిలో 52 మంది మరణించారు, మొత్తం 887 మందిలో 462 మరణాలు సంభవించాయి. ఇక అప్పటి నుంచి అమెరికాలో ప్రజలకు సోకడం మొదలైంది. అక్కడ మిషిగాన్‌ స్టేట్‌లో క్షీరదం నుంచి బర్డ్‌ఫ్లూ మనిషికి సోకిన మొదటి కేసు నమోదయిందని చెబుతున్నారు.

Next Story

Most Viewed