బిగ్ బ్రేకింగ్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం..?

by Disha Web Desk |
బిగ్ బ్రేకింగ్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం..?
X

దిశ, డైనమిక్ బ్యూరో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‭పై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఆయన కారుపై బాంబుతో దాడి చేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ ప్రమాదం నుంచి పుతిన్ సురక్షితంగా బయటపడ్డారని సమచారం. పుతిన్ తన ఇంటికి తిరుగి వెళ్లే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై బాంబు దాడి జరిగిందని, కారు ఎడమ చక్రం భారీ శబ్దంతో పేలిందని ఓ వార్త సంస్థ ప్రచురించింది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై పుతిన్‌ను సురక్షితంగా తప్పించారని పేర్కొంది. ఎటువంటి గాయాలు లేకుండా పుతిన్‌ను అధికారిక నివాసానికి తరలించారు. ఈ ప్రమాదం ఎప్పుడు జరిగిందానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీనికి సంబంధించి కొంత మంది అధికారులపై చర్యలు తీసుకోవటంతో పాటు, మరికొందరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

పుతిన్ సైతం తన పైన జరిగిన హత్యాయత్నం గురించి వెల్లడించారు. 2017లో ఐదుసార్లు తనపై హత్యాయత్నం జరిగిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా, వీటికి తాను భయపడనని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే ఘటనకు సంబంధించి అనేక రకాలుగా కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్ పైన దాడి ప్రారంభించిన తరువాత రష్యాలోనే పుతిన్‌కు వ్యతిరేకంగా కొందరు ప్రదర్శనలు నిర్వహించారు. పుతిన్‌కు వ్యతిరేకంగా ఉన్న వారి సంఖ్య పెరుగుతోందని, వారి నుంచి పుతిన్‌కు ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ అంతర్జాతీయ కథనాలు వెలువడుతున్నాయి. కాగా, తాజాగా జరిగిన ఈ హత్యాయత్నం గురించి పుతిన్ కార్యాలయం నుంచి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.



Next Story