ఎంపీ ఎన్నికల్లో బీపీ, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి

by Disha Web Desk 15 |
ఎంపీ ఎన్నికల్లో బీపీ, బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి
X

దిశ, చౌటకూర్ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, సైన్స్ టెక్నాలజీ మంత్రి దామోదర అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలనే ఉద్దేశంతో ఆదివారం నాడు మండలంలోని సరాఫ్ పల్లి గ్రామ శివారులో ఓ ఫంక్షన్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయమే జరిగిందని, అందుకు రాష్ట్ర ప్రజలే బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి

కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. అలాగే భారతదేశం అభివృద్ధి పథంలో మరింత దూసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలన్నారు. ప్రజలకు రుణ మాఫీ, ఇండ్ల స్థలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఆందోల్ ను గత ప్రభుత్వం అభివృద్ధి చేయడం లో విఫలమైందని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఆందోల్ ను అభివృద్ధి చేయడంలో ముందు ఉంటుంది అన్నారు. ఆందోల్, చౌటకూర్, పుల్కల్ మండలాలకు ఇప్పటికే వందల కోట్లు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నత్తి దశరథ్, మండల నాయకులు రాంచందర్ రెడ్డి, పర్కాల రాంరెడ్డి, బాలాగౌడ్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర బ్యూరో సభ్యులు నారాయణ, మాజీ ఎంపీపీ నారాయణ, మత్స్య శాఖ డైరెక్టర్ రాజాయ్య, సీనియర్ నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed