అతిగా చక్కెర తింటున్నారా.. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

by Samataha |
అతిగా చక్కెర తింటున్నారా.. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : చక్కెర అంటే ఇష్టపడని వారు ఉండరు. అయితే ఇది లిమిట్‌గా తింటే ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ, అతిగా తింటే మాత్రం ముప్పు తప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైట్ షుగర్ అతిగా తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట. అందువలన వైద్యులు వైట్ షుగర్‌కు చాలా దూరంగా ఉండాలని చెప్పుకొస్తుంటారు. కాగా, అతిగా షుగర్ తినడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దీని వలన కలిగే ఇబ్బందులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అధికంగా వైట్ షుగర్ తీసుకోవడం వలన అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోందంట. దీని వలన మన మెదడులోని డొపమైన్ విడుదలకు కారణం అవుతోంది. దీంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

  • చక్కెర లివర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. వైట్ షుగర్ అధికంగా తీసుకోవడం వలన లివర్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటున్నారు వైద్యులు.

  • అధిక చక్కెర వలన గుండె జబ్బులు పెరుగుతాయి. ఎక్కువగా షుగర్ తీసుకోవడం వలన రక్తప్రసరణలో ఇన్సులిన్ ప్రభావం చెందుతుంది. ఇది అర్టెరీ బ్లాక్కి దారితీసి, కొన్ని సమయాల్లో గుండె పోటు కూడా రావచ్చును. కొన్నిసార్లు మీ గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. దీనికి అధిక చక్కెర కూడా కారణం కావచ్చు. అందువలన ఈ లక్షణం కనిపిస్తే నెగ్లెట్ చేయోద్దు.

  • అధిక మోతాదులో షుగర్ తినేవారిలో స్కిన్ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అంటే త్వరగా వృద్ధాప్యం రావడం వంటివి కనిపిస్తాయి. రక్త సరఫరా లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువ అవుతుంది ఇది స్కిన్ కొల్లాజెన్ ఉత్పత్తి పై ప్రభావం చూపుతుంది. ఇది చర్మం రంగులో మార్పు కనిపించేలా చేస్తుంది. ఈ లక్షణం కనిపించినా చక్కెరకు దూరంగా ఉండాలి.

  • వైట్ షుగర్ తినడం వలన త్వరగా బరువు పెరుగుతారు. ఇది అధిక బరువు, కొన్ని సార్లు ఊబకాయానికి కూడా దారి తీయవచ్చును.మీరు బరువు పెరుగుతున్నట్లు అనిపించినా చక్కెరను అధికంగా తీసుకోకూడదు.
Next Story

Most Viewed