జర్మనీలో బతుకమ్మ సంబురాలు

by Disha Web Desk |
జర్మనీలో బతుకమ్మ సంబురాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఖండంతారాలు దాటినా సంస్కృతి, సంప్రదాయం మరవకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆచరిస్తున్నారు. జర్మనీ దేశం మ్యూనిచ్ నగరంలో స్థిరపడిన తెలంగాణ ముద్దుబిడ్డలు శనివారం బతుకమ్మ సంబురాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వారి పరిసరాలు, స్థానికంగా లభించే పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. దాదాపు 200 మందికి పైగా మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక కమ్యూనిటీ హాల్‌లో కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఎక్కడ ఉన్నా తెలంగాణకు ప్రత్యేమైన బతుకమ్మని నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.


తాము నిర్వహించే వేడుకలతో జర్మనీలోని ఇతర నగరాల్లో స్థిరపడిన తెలంగాణ బిడ్డలు స్ఫూర్తిని పొందాలన్నారు. ఆలాగే వివిధ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెలంగాణకే ప్రత్యేకమైన పండుగను జరుపుకోవలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం బతకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని నిర్వాహకులు వైద్యుల మానస మహేష్, మేసినేని సుష్మ నరేష్, వేమంతుల పుష్ప శ్రీనివాస్, అన్నమనేని కాంచన సుజిత్, జిడిగి సంధ్య రమేష్, రామడుగు వినిషా వికాస్‌లు తెలిపారు.




Next Story

Most Viewed