మారిషస్‌లో వీర సావర్కర్ విగ్రహావిష్కరణ..

by Disha Web Desk 13 |
మారిషస్‌లో వీర సావర్కర్ విగ్రహావిష్కరణ..
X

పోర్ట్ లూయీస్ (మారిషస్): మారిషస్‌ రాజధాని నగరం పోర్ట్ లూయిస్‌లో ఇప్పటికే 13 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటైంది. మే 28న (శుక్రవారం) వీర సావర్కర్ జయంతి రోజున సావర్కర్ విగ్రహాన్ని కూడా అక్కడ ఆవిష్కరించబోతున్నారు. దీన్ని మారిషస్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్, ఉప ప్రధాని లీలాదేవి దూకున్ లుచూమున్ ఆవిష్కరిస్తారని నిర్వాహకులు వెల్లడించారు. మహారాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి రవీంద్ర చవాన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సావర్కర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

“మారిషస్ వంటి దేశంలో వీర సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారని విని సంతోషంగా ఫీల్ అయ్యాను. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సావర్కర్ ఆలోచనలు, బోధనలను అంగీకరిస్తున్నారు. తాను ఏ మతానికీ వ్యతిరేకం కాదని సావర్కర్ చెప్పేవారు. హిందువులు ఇతర దేశాలలో అభివృద్ధి చెందాలని, మాతృభూమి గర్వపడేలా చేయాలని ఆయన చెప్పేవారు" అని వీర సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed