ఇవాళ వరల్డ్ థియేటర్ డే

by  |
ఇవాళ వరల్డ్ థియేటర్ డే
X

దిశ, వెబ్‌డెస్క్:
మనిషి జీవితంలో థియేటర్లు, నాటికల ప్రాముఖ్యత గురించి అవగాహన ఏర్పరిచే క్రమంలో ప్రతి సంవత్సరం మార్చి 27న వరల్డ్ థియేటర్ డే అని జరుపుకుంటారు. ప్రత్యక్షంగా కళాకారులు, సంగీతకారులు నాటికలు ప్రదర్శించడమే థియేటర్ ఆర్ట్. మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ సర్వీసులు ప్రాచుర్యం పొందుతున్నప్పటికీ థియేటర్లకు ఆదరణ తగ్గలేదు.

కానీ రానున్న కాలంలో వీటికి సరైన ఆర్థిక సదుపాయం లేక మరుగునపడే అవకాశం ఉంది కాబట్టి వరల్డ్ థియేటర్ డే పేరుతో కొంత అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ థియేటర్ ఇనిస్టిట్యూట్ ఈరోజును నిర్ణయించింది. 1961 నుంచి ప్రతి ఏడాది జరుపుకుంటున్నారు. కానీ ఏడాది కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి వేడుక చేయట్లేదని అంతర్జాతీయ థియేటర్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఐదో శతాబ్దం ప్రారంభంలో మొదటిసారిగా ఏథెన్స్‌లోని అక్రోపోలీస్‌లో థియేటర్ ఆఫ్ డియోనైసస్ వద్ద మొదటి నాటిక ప్రదర్శన జరిగింది.

Tags: World Theatre Day, International Theatre Inistitute, Acropolis, Athens


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story