గాలి బుడగలో వచ్చి.. షాపింగ్ చేసిన మహిళ

by  |
గాలి బుడగలో వచ్చి.. షాపింగ్ చేసిన మహిళ
X

దిశ వెబ్ డెస్క్: ప్రపంచమంతా ఎక్కడ చూసినా. . కరోనా భయయే. ఎవరైనా తుమ్మినా.. దగ్గినా.. ప్రజలు భయపడుతున్నారు. ఒకరికి దగ్గరగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. కరోనా వైరస్ వచ్చినవాళ్లు.. తుమ్మినా.. దగ్గినా.. వాళ్లను తాకినా.. కరోనా తమకు సోకుతుందనే భయంతో కొంతమంది దాన్నుంచి తప్పించుకోవడానికి రకరకాల ఐడియాలను, మార్గాలను అన్వేషిస్తున్నారు. కరోనాకు చెకప్ చెప్పేందుకకు మొన్న ఓ హెయిర్ స్టైలిష్ట్ గొడుగు అడ్డం పెట్టుకుని హెయిర్ కట్ చేసింది. మాస్కులు, చేతికి గ్లవ్స్ ధరించినా వైరస్‌ ఏదో ఒకలా సోకే ప్రమాదం ఉందని చెబుతున్న నేపథ్యంలో కొందరు తమ శరీరమంతా కప్పి ఉంచే వస్త్రాలను ధరిస్తున్నారు. చైనాకు చెందిన ఓ మహిళ జిరాఫీ దుస్తుల్లో హాస్పిటల్‌కు వెళ్లడం వైరల్‌గా మారింది. తాజాగా యూకేకు చెందిన ఓ మహిళ వాటర్ స్పోర్ట్స్‌కు ఉపయోగించే జార్బ్ బాల్‌లోకి దూరి షాపింగ్‌కు వెళ్లింది.

కరోనాకు చెక్ చెప్పేందుకు కొంతమంది రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అలానే యూకేకు చెందిన ఓ మహిళా… కెన్ట్‌లోని హెర్నేబే ప్రాంతానికి చెందిన సూపర్ మార్కెట్ కు బుడగలో దూరి వచ్చింది. రోడ్డుపై కూడా అలానే నడుచుకుంటూ వెళ్లింది అయితే ఆమె వెంట ఓ సహాయకుడు ఉన్నాడు. అతను మాట్లాడుతూ.. ‘‘అమెకు జెర్మాఫోబిక్. బ్యాక్టీరియా, వైరస్ లంటే ఎలర్జీ. ఆమె రోడ్డుపై, షాప్ లో అలా తిరుగుతుంటే.. చాలా మంది విచిత్రంగా చూశారు. దీంతో స్టోర్ సిబ్బంది ఆమెను బయటకు వెళ్లాలని కోరార’’ని వివరించాడు. ఆమె ఉపయోగించిన బుడగను .. సాధారణంగా జార్బ్ బాల్ అంటారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. నెటిజనులు ఆమెపై రకరకాల కామెంట్లు చేశారు. ఆమె ఉపయోగించిన ఆ ప్లాస్టిక్ బుడగకు వైరస్ అంటుకొనే ప్రమాదం ఉందని, కరోనా వైరస్ ప్లాస్టిక్ మీద సుమారు 3 రోజులు ఉంటుందని, అది కూడా తెలియదా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Next Story