ముగ్గురు పిల్లల తల్లి 20 ఏళ్ల యువకుడితో కలిసి ఆ రాత్రి..

by  |
Illegal affair
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్య, పిల్లల కోసం భర్త రేయింబవళ్లు కష్టపడుతుండగా భార్య మాత్రం ఇంట్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తోంది. భర్త బయటకు వెళ్లగానే మరొకరితో రాసలీలలు సాగిస్తూ కుటుంబాన్ని బజారున పడేసింది. ముగ్గురు పిల్లలు ఉన్నా.. కామంతో కళ్లు మూసుకుపోయి తనకన్న చిన్న వయసు ఉన్న యువకుడితో కామక్రీడలు సాగించింది. శాశ్వతంగా అతడితోనే ఉండిపోవాలని ఏకంగా భర్తనే లేపేసింది. ముగ్గురు పిల్లలను అనాథలను చేసింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన విషాదాన్ని నింపింది.

కృష్ణగిరి జిల్లా కెలమంగళంలోని ఉనిసెట్టి గ్రామానికి చెందిన అయ్యప్ప(37) టెంపో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు కొన్నాళ్ల క్రితం రూప(30)తో వివాహం అయింది. వీరికి ముగ్గురు సంతానం. అయ్యప్ప ఉపాధి నిమిత్తం జవుళగిరి సమీపంలోని మంచుగిరి గ్రామంలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన తంగమణి(20) అయ్యప్పకు దగ్గర బంధువు. ఒకే గ్రామం కావడంతో తరచూ అయ్యప్ప ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఆయన భార్య రూపతో తంగమణికి వివాహేతర సంబంధం ఏర్పడింది.

husband murder

తంగమణి కంటే రూప పదేళ్లు పెద్దది. అయినా అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త టెంపోతో బయటకు వెళ్లగానే తంగమణి రూప ఒడిలో చేరిపోయేవాడు. వీరిద్దని వ్యవహారం తెలుసుకున్న భర్త వెంటనే కుటుంబాన్ని ఉనిసెట్టి గ్రామానికి మార్చాడు. అయినా వారిద్దరి రాసలీలలు ఆగలేదు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం భర్తను, పిల్లలను వదిలేసి రూప, తంగమణి ఇల్లు వదిలి పారిపోయారు. ఇద్దరు కలిసి మరోప్రాంతంలో కాపురం పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన అయ్యప్ప ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో బయట పడ్డాడు.

కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి తంగమణి, రూపలను పట్టుకొచ్చారు. ఇద్దరిని మందలించి ఎవరి ఇళ్లలో వారిని ఉంచారు. అయితే భార్య లేచిపోయిందని అందరూ అంటుండంతో అయ్యప్ప మరోసారి ఆత్మహత్యాయత్నం చేసి మృత్యువు చివరి అంచుల వరకు వెళ్లి వచ్చాడు. అదే అవకాశంగా భావించిన రూప భర్తను హత్య చేయాలని ప్రియుడు తంగమణితో ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా ఈ నెల 22న ఇద్దరు కలిసి ఇంట్లో నిద్రిస్తున్న అయ్యప్ప గొంతు నులిమి చంపేశారు.

ఉదయాన్నే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులను, బంధువులకు తెలిపింది రూప. వెంటనే అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఆమె వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన బంధువులు రూప, తంగమణిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కాగా, తల్లి జైలుకు వెళ్లడం.. తండ్రి హత్యకు గురికావడంతో ముగ్గురు చిన్నపిల్లలు అనాథలయ్యారు. అటు తండ్రిలేక.. ఇటు తల్లి లేక చిన్నారులు ఏడుస్తున్న తీరును చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.


Next Story