తన బిడ్డను చంపేస్తారంటూ పోలీస్ వాహనం ఎక్కి వివాహిత నిరసన..

by  |
తన బిడ్డను చంపేస్తారంటూ పోలీస్ వాహనం ఎక్కి వివాహిత నిరసన..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : అత్తింటి వేధింపుల నుంచి తనను కాపాడాలంటూ ఓ మహిళ ఏకంగా పోలీస్ వాహనం ఎక్కి నిరసన తెలిపింది. అదనపు కట్నం కోసం తనను హింసిస్తున్నారంటూ బాధితురాలు ఆరోపించింది. సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. రుద్రంగి మండలం గైదిగుట్ట తండాకు చెందిన గుగులోతు మౌనిక.. తనను భర్తతో పాటు అత్తా మామలు వరకట్నం కోసం వేధిస్తున్నారని తనకు న్యాయం చేయాలని కోరింది.

తన పిల్లలతో కలిసి పోలీస్ వాహనం పైకి ఎక్కి నిరసన తెలిపింది. బాధితురాలు మాట్లాడుతూ.. గతంలోనే తన భర్తతో గొడవ జరుగగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, తనకు అంగవైకల్యంతో పుట్టిన పాప ఉందని, ఆ పాపను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆరోపించింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఎస్‌ఐ రాజు మాట్లాడుతూ గతంలోనే భార్యభర్తల గొడవకు సంబంధించి కేసు నమోదు చేశామని, ఇప్పుడు అది కోర్టులో ఉందని వివరించారు. కోర్టుకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.



Next Story

Most Viewed