ప్రైవేట్​ ఆస్పత్రులపై ఫిర్యాదులకు ‘వాట్సాప్’​నెంబర్​

by  |
ప్రైవేట్​ ఆస్పత్రులపై ఫిర్యాదులకు ‘వాట్సాప్’​నెంబర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా చికిత్సకు వెళితే లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్​ఆస్పత్రులపై నియంత్రణకు వైద్యారోగ్య శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి వేలల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. చనిపోతే కూడా మొత్తం బిల్లులు చెల్లించిన తర్వాతే డెడ్​బాడీని ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దోపీడీ కట్టడి కోసం రంగంలోకి దిగింది. కరోనా చికిత్సలకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ఏ ప్రైవేటు ఆస్పత్రయినా కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తే 9154170960 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Next Story

Most Viewed