వెస్టిండీస్ జట్టుకు భారీ జరిమానా

by  |
వెస్టిండీస్ జట్టుకు భారీ జరిమానా
X

దిశ, స్పోర్ట్స్: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా వెస్టిండీస్ జట్టుకు భారీ జరిమానా పడింది. సెయింట్ లూసియాలో జరిగిన రెండో టెస్టులో నిర్దేశించిన సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే మూడు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేయడంతో ఐసీసీ వెస్టిండీస్ జట్టుపై 60 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది. దానితో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో 6 పాయింట్లను కోత పెట్టింది. ‘ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.22 ప్రకారం ఒక సెషన్‌లో వేయాల్సిన సరాసరి ఓవర్లు మూడు సెషన్లలో తక్కువగా వేసింది.

ఒక్కో సెషన్‌కు 20 శాతం చొప్పున మొత్తం శాతం జరిమానా విధిస్తున్నాము’ అని ఐసీసీ ప్రకటించింది. కాగా, మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ముందు కెప్టెన్ కార్లోస్ బ్రాత్‌వెయిట్ తన తప్పిదాన్ని ఒప్పుకోవడంతో కేవలం జరిమానా, పాయింట్ల కోతతో సరిపెట్టారు. మరోసారి జరిగితే అతడిపై ఒక మ్యాచ్ వేటు పడే అవకాశం ఉంటుంది. కాగా, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 158 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా వైట్ వాష్ చేసింది.



Next Story