రంగంలోకి రాహుల్ గాంధీ.. రేపే ఆ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ

by Disha Web Desk 9 |
రంగంలోకి రాహుల్ గాంధీ.. రేపే ఆ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది ప్రచారంలో కాంగ్రెస్ నేతలు జోరు పెంచుతున్నారు. అగ్రనేతలతో ప్రచారం నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. ఆదివారం నాగర్‌కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అలంపూర్ ఎర్రవల్లి క్రాస్ రోడ్డులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి విజయం కోసం రాహుల్ గాంధీ ఈ ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు తదితరులు పాల్గొననున్నారు.

Next Story

Most Viewed