అక్కడ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ ఫీజు.. రూ.1/- మాత్రమే

by  |
అక్కడ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ ఫీజు.. రూ.1/- మాత్రమే
X

దిశ, వెబ్ డెస్క్ : క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల దేశ ప్ర‌జ‌ల ఆర్థిక స్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ స‌మ‌యంలో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ ప్ర‌జ‌లు త‌మ పిల్ల‌ల చ‌దువుల కోసం పెద్ద ఎత్తున ఫీజులు క‌ట్ట‌లేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే ఓ కాలేజీ మాత్రం క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ పేద విద్యార్థుల ప‌ట్ల జాలి చూపిస్తోంది. అడ్మిష‌న్ ఫీజు కింద కేవ‌లం రూ.1 మాత్ర‌మే ఫీజును తీసుకుంటూ కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల ధ‌న‌దాహానికి చెంపపెట్టులా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ప్రస్తుతం కాలంలో.. కాలేజీ చదువుల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిందేనన్న సంగతి తెలియంది కాదు. అయితే, బెంగాల్ లోని ‘రిషి బంకిమ్ చంద్ర’ కాలేజీలో యూజీ కోర్సుల అడ్మిష‌న్ కోసం నామమాత్రపు ఫీజు మాత్రమే తీసుకోవడం విశేషం. అక్కడ యూజీ కోర్సుల ప్రవేశ రుసుము రూ.3500 నుంచి రూ.11వేల వ‌ర‌కు ఉంటుంది. కానీ ఓ వైపు కరోనా సంక్షోభం.. మరోవైపు, ఇటీవలే ఆంఫన్ తుఫాన్ రావడంతో.. అక్కడి ప్రజల పరిస్థితి ఎంతో దయనీయంగా తయారైంది. అందువల్ల ఈ సారి బంకిం చంద్ర కాలేజీలో కేవ‌లం రూ.1 మాత్ర‌మే అడ్మిష‌న్ ఫీజు తీసుకుంటున్నారు. దాదాపు పేద, మధ్య తరగతి ప్రజలే ఇక్కడ చదువుకుంటారు. ఇందులో అడ్మిషన్ పొందాలంటే.. ముందుగా ఆన్‌లైన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీని ఖరీదు మాత్రం రూ.60గా నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం బంకిం చంద్ర కాలేజీలో 21 యూజీ కోర్సుల‌ను అందిస్తుండగా.. అడ్మిష‌న్ల ప్ర‌క్రియ ఇప్ప‌టికే కొన‌సాగుతోంది. ఆగ‌స్టు 17 త‌రువాత మెరిట్ ఆధారంగా అడ్మిష‌న్ల‌ను కేటాయిస్తారు.

ఈ రోజు మనం 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సరిగ్గా 74 సంవత్సరాల క్రితం.. అంటే 1947లో బెంగాల్ లో రిషి బంకిం చంద్ర కాలేజీ ప్రారంభమైంది. కొంతమంది విద్యావంతుల ప్రోత్సాహంతో ఈ విద్యా సంస్థ ఏర్పాటైంది. మొదట ఇది ఈవినింగ్ కాలేజ్‌గా ప్రారంభమైనా ఆ తర్వాత మార్నింగ్ క్లాసులు కూడా మొదలుపెట్టారు. కాగా నాటి నుంచి నేటి వరకు దిగ్విజయంగా నడుస్తున్న ఈ కాలేజీకి వెస్ట్ బెంగాల్ స్టేట్ యూనివర్సిటీ గుర్తింపు ఉంది.



Next Story

Most Viewed