వరద వార్షికోత్సవం… నాయకులకు స్వాగతం

14

దిశ, ఏపీ బ్యూరో: ఎటకారమైనా.. మమకారమైనా గోదారోళ్ల తర్వాతనే ఎవరైనా! గోదావరి తీరంలో ప్రకృతి వైపరీత్యాలు సహజం. లోతట్టు ప్రాంతాలు తరచూ ముంపునకు గురవుతుంటాయి. అలాంటిదే తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు మండలం ఈబీసీ కాలనీ. ఇది పిఠాపురం నియోజకవర్గంలో ఉంటుంది. ప్రతి ఏటా నాయకులు వస్తుంటారు. చూసి పోతుంటారు. హామీలిస్తుంటారు. కానీ నెరవేర్చరు. అందుకే 2013లో కాలనీ వాసులు ఇలా బ్యానర్​ కట్టి నేతలకు స్వాగతం పలికారు. దేనికదే చెప్పుకోవాలి మరి. ఏవైనా గోదారోళ్లు.. గోదారోళ్లే.. ఆయ్!