గుణాత్మక విద్య పేరిట ప్రైవేటుకు అప్పగింత

by  |
గుణాత్మక విద్య పేరిట ప్రైవేటుకు అప్పగింత
X

దిశ, న్యూస్​బ్యూరో: రాష్ట్రాల శాసనసభల్లో, పార్లమెంట్​లో చర్చకు పెట్టకుండా రాత్రికే రాత్రే కొత్త విద్యాపాలసీని కేంద్ర కేబినెట్ ఆమోదించడం అప్రజాస్వామిక చర్యగా పలువురు విద్యారంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ మార్కెట్ అవసరాల కోసం మానవ వనరులు తయారు చేయడమే విద్యావిధానం లక్ష్యంగా బహిరంగంగానే ప్రకటించుకోవడం విద్యా ప్రైవేటీకరణను పూర్తిచేసే లక్ష్యంగానే భావించాలని వారు అన్నారు. మూడు రోజులుగా తెలంగాణ ప్రొగ్రెసివ్​ టీచర్స్​ ఫెడరేషన్​ ఆధ్వర్యంలో జాతీయ విద్యావిధానంపై వెబినార్​ నిర్వహించారు. గుణాత్మక విద్య పేరుతో ప్రజాధనాన్ని చట్టబద్ధంగా ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టే విధంగా రూపకల్పన చేశారని విమర్శించారు.

ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో కూడా దీన్ని కచ్చితంగా అమలు చేయగలరా అని ప్రశ్నించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్​ హరగోపాల్, బుర్ర రమేష్, కె.లక్ష్మీ నారాయణ, కె. నారాయణ, ఎడమ శ్రీనివాస్ రెడ్డి, కె.వేణుగోపాల్ ముఖ్య వక్తలుగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమ నిర్వహణలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. రమణ, మైస శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు వై.అశోక్ కుమార్, తిరుపతి, రమేష్, ఎం. రవీందర్, నారాయణమ్మ కె.కిషన్​ రావు పాల్గొన్నారు.



Next Story

Most Viewed