ప్రతిరోజు రైతులకు 300 టోకెన్లు ఇస్తాం.. కానీ షరతులు వర్తిస్తాయి

by  |
Tokens
X

దిశ, నేరేడుచర్ల : రైతులు తమ ధాన్యాన్ని మిర్యాలగూడ రైస్ మిల్లుల్లో అమ్ముకునేందుకు రోజుకు 300 టోకెన్లు అందిస్తామని సూర్యాపేట జిల్లా వ్యవసాయాధికారి రామారావు తెలిపారు. మంగళవారం నేరేడుచర్ల మండలంలోని చిల్లెపల్లి చెక్ పోస్ట్ వద్ద హుజుర్ నగర్ ఏడీఏ సంధ్యారాణి, నేరేడుచర్ల తహశీల్దార్ సరితతో కలిసి రైతులకు టోకెన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రైతులు కోరిన విధంగానే ప్రతిరోజూ 300 టోకెన్లను సూర్యాపేట, నల్లగొండ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన చిల్లెపల్లి చెక్ పోస్ట్ వద్ద ధాన్యంతో వచ్చిన ట్రాక్టర్లకు టోకెన్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పంపిణీ కొనసాగుతుందని వెల్లడించారు. రైతులు తమవెంట పట్టాదార్ పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలాల వ్యవసాయ అధికారులు వీరభద్రరావు, దీపికా, ప్రియతం కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్, ఏఈవోలు స్వప్న అవినాష్, శారద, వెంకటేష్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed