బంగారంగా మారిన నీరు!

by  |
water-drops
X

దిశ, ఫీచర్స్ : నిత్య జీవితంలో చుక్క నీరు కూడా దొరకనప్పుడు మనిషికి దాన్ని మించిన సంపద ఏదీ ఉండదన్నది వాస్తవం. అందుకే కొన్ని కరువు ప్రాంతాల్లో నీళ్లను బంగారంతో సమానంగా చూస్తారు. మరి నీళ్లు నిజంగానే బంగారంగా మారిపోతే.. ఆ ఊహలకు రూపమిచ్చే ప్రయత్నం చేశారు చెక్ పరిశోధకులు. నీటిని లోహ(గోల్డ్ మెటల్) స్థితికి మార్చడంలో విజయవంతమయ్యారు. కొన్ని సెకన్లపాటు ఆ స్థితిలో ఉంచగలిగారు.

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకున్న ‘ఆల్కమీ’ పుస్తకం గురించి తెలిసే ఉంటుంది. ఏదైనా లోహాన్ని బంగారంగా ఎలా మార్చగలమో ‘ఆల్కెమీ’ ప్రక్రియ వివరిస్తుంది. ఈ మూఢ నమ్మకం మధ్యయుగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండేది. లోహాలను ఉత్తమ లోహాలుగా మార్చగలిగే మహత్తర శక్తిగల రాళ్లు ఉన్నాయని.. ఇవి కేవలం స్పర్శామాత్రంగా ఇనుము వంటి లోహాలను బంగారంగా మార్చగలవని పూర్వీకులు నమ్మేవారు. ఈ ఇతివృత్తంగానే ‘ఆల్కెమీ’ పుస్తకం వచ్చింది. కాగా చెక్ పరిశోధకులు ఇప్పుడు దీన్ని నిజం చేసి చూపించారు. వాటర్ ప్రాపర్టీని బంగారంగా మార్చడానికి 48 మెగాబార్ (4,73,72,316 అట్మాస్మియర్స్)/15 మిలియన్ల పీడనం అవసరం కాగా, ఇది ప్రస్తుత ప్రయోగాత్మక సామర్థ్యాలకు మించినది. అటువంటి అధిక పీడనం పెద్ద గ్రహాలు లేదా నక్షత్రాల లోపలి భాగంలో మాత్రమే ఉంటుంది. అయితే చెక్ పరిశోధకులు పీడనం, ఉష్ణోగ్రత అవసరం లేకుండానే నీటిని బంగారంగా మార్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలోనే కొన్ని క్షార (ఆల్కలీ) లోహాల నుంచి ఎలక్ట్రాన్లను అరువుగా తీసుకుని.. నీటిపై ప్రయోగిస్తే అది సాధ్యమవుతుందని తేల్చారు.

ఆవర్తన పట్టికలోని (గ్రూప్ 1) సోడియం, పొటాషియం వంటి మూలకాల సాయంతో ఈ ప్రయోగాన్ని చేశారు. అయితే యూట్యూబ్‌లో సైన్స్ వీడియోలను రూపొందించడంలో పేరుగాంచిన రసాయన శాస్త్రవేత్త ఫిల్ మాసన్.. అమ్మోనియాలో ఇలాంటి చర్యను చేసి చూపాడు. అమ్మోనియా బంగారంలా మెరిసిపోతుందనే వాస్తవం పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవికి వివరించగా, దాన్ని ఆధారంగా చేసుకుని అమ్మోనియాపై ప్రయోగాలు చేశారు. ఇక్కడ చెక్ పరిశోధకుల బృందం అమ్మోనియాకు బదులుగా అదే విధానాన్ని నీటితో ప్రయత్నించాలనుకుంది, కానీ ఈ క్రమంలో ఒక సవాల్‌ను ఎదుర్కొంది.

నీటితో క్షార లోహాలు కలిస్తే పేలుడు సంభవిస్తుంది. ఇలా జరగకుండా ఉండేదుకు పరిశోధకులు గది ఉష్ణోగ్రత వద్ద ఓ సిరంజిలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకుని ఓ వాక్యూమ్ చాంబర్‌లో పెట్టారు. సిరంజి నుంచి నిదానంగా ఆ ద్రావణం బిందువులను విడుదల చేసి.. నీటి ఆవిరితో చర్య జరిపేలా చేశారు. అప్పుడు ఆ నీటి బిందువు ఘనీభవించి, మైక్రోమీటర్‌లో పదో వంతు మందంతో పొరను ఏర్పరుస్తుంది. బిందువు నుంచి ఎలక్ట్రాన్లు త్వరగా నీటిలోకి వ్యాప్తి చెందుతాయి. పాజిటివ్ మెటాలిక్ అయాన్‌లతో కలిసి కొన్ని సెకన్లలో, నీటి పొర బంగారు రంగులోకి మారుతోంది. కానీ ఇది చాలా రిస్కీ ప్రాసెస్ అని నీటితో మూలకాలు ప్రతిచర్యనొందే టైమింగ్ చాలా ముఖ్యమని, ఇందులో ఏమాత్రం తేడా జరిగినా పేలుడు సంభవిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.


Next Story

Most Viewed