ఆ దారిలో ప్రయాణం ఎంత ప్రమాదమో..

by  |
ఆ దారిలో ప్రయాణం ఎంత ప్రమాదమో..
X

దిశ, తాండూర్ : మండల కేంద్రంలోని ఐబీ సమీపంలో ఇటీవల నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్ యూబీ) రహదారి గుంతల మయంగా మారింది. నిత్యం రాకపోకలు సాగించే వాహనచోదకులు, వివిధ గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి కింద రహదారిపై ఎప్పుడు నీళ్లు నిలిచి ఉంటాయి. బ్రిడ్జి కింద రహదారిపై నిలిచిన నీళ్లను మోటార్ల ద్వారా బయటకు పంపిస్తున్నారు. అయినప్పటికీ మరోవైపు భూమిలో నుంచి నీళ్ళు ఊటల ద్వారా బ్రిడ్జి కిందికి చేరుతున్నాయి.

చిన్నపాటి వర్షం కురిసిన బ్రిడ్జి కిందకు పెద్ద ఎత్తున చేరి అండర్ బ్రిడ్జి చెరువును తలపిస్తోంది. దీంతో కొన్ని గంటల పాటు బ్రిడ్జి కింద రాకపోకలు నిలిచి పోతున్నాయి. కొందరు వాహనచోదకులు బ్రిడ్జి కింద నిలిచిన నీళ్ళలోంచి రాకపోకలు సాగిస్తున్నారు. గుంతల్లో ప్రయాణించి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జి కింద అడుగడుగున గుంతలు ఉండడం వలన ప్రమాదాలే కాకుండా వాహనాలు కూడా చెడి పోతున్నాయని చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి బ్రిడ్జి కింద రహదారిపై నీళ్ళు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు.



Next Story

Most Viewed