కొత్త వివాదంలో ఇరుక్కున్న వరంగల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

by  |
warangal corporation elections pamphlets issue
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల వేళ స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదంలో ఇరుక్కున్నారు. ప్రజాప్రతినిధులు డబ్బులు అడుగుతున్నారంటూ రిలీజ్ అయిన పాంప్లెట్ ఇప్పుడు వరంగల్ లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ కరపత్రాలు హల్‌చల్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు రూ.30ల‌క్ష‌ల నుంచి రూ.50ల‌క్ష‌ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నారంటూ… గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌ర‌ప‌త్రం విడుద‌ల చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మొదటి నుండి పార్టీలో ప‌నిచేస్తున్న వారికి కాకుండా రౌడీషీట‌ర్ల‌కు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు టికెట్లు ఇస్తున్నారంటూ సదరు పాంప్లెట్ లో పేర్కొన్నారు.

డివిజ‌న్లలో స‌ర్వేల పేరుతో టికెట్ల‌ను కేటాయిస్తున్న‌ట్లుగా పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం చేస్తున్నా… అవి నామ‌మాత్ర‌మేన‌ని ఎమ్మెల్యేలే చెప్ప‌డంపై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌నే అభిప్రాయాన్ని క‌ర‌ప‌త్రంలో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలిచే అభ్య‌ర్థుల‌కు, పార్టీ కోసం ప‌నిచేసే వారికి, విద్యావంతుల‌కు టికెట్లు ద‌క్కేలా చూడాల‌ని, దీనిపై ట్విట్ట‌ర్‌లో స్పందించాల‌ని కోర‌డం విశేషం.



Next Story

Most Viewed