రెచ్చిపోయిన మరో వైసీపీ ఎమ్మెల్యే.. ఈసారి ఏకంగా పోలీసులకే వార్నింగ్..!

by Anjali |
రెచ్చిపోయిన మరో వైసీపీ ఎమ్మెల్యే.. ఈసారి ఏకంగా పోలీసులకే వార్నింగ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లని అడ్డుకుంటున్న పోలీసులను దూషిస్తూ మీ అంతు చూస్తానంటూ పోలీసులను బెదిరించాడు. గతంలో కూడా బొజ్జల పోలీసులతో దురుసు ప్రవర్తించినట్లు సమాచారం. ఇప్పుడు గూండాయిజంతో గెలవాలని కుట్ర చేస్తున్నాడు.. బొజ్జల అరాచకాలకి ఈ రోజుతో చెల్లుచీటి అవుతుందని అవతలి పార్టీ నేతలు కామెంట్లు పెడుతున్నారు. ఇక తెనాలి ఎమ్మెల్యేను క్యూ లైన్ లో వెళ్లి ఓటు వేయాలన్నందుకు ఎమ్మెల్యే శివకుమార్ ఓటర్ ను చెంప మీద కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఓటర్ సుధాకర్ వెంటనే ఎమ్మెల్యేను తిరిగి కొట్టారు. తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఓటర్ సుధాకర్ పై తీవ్ర స్థాయిలో దాడికి పాల్పడ్డారు. అక్కడున్న పోలీసులు వారి గొడవ నుంచి తప్పించి సుధాకర్ ను పక్కకు తీసుకెళ్లారు.

Next Story