ఉమ్మడి వరంగల్‌లో విచిత్రం.. ఠాణాలో బాతు పంచాయితీ

150
Duck-Quarrel

దిశ, కేసముద్రం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాతు పంచాయితీ ఠాణాకు చేరింది. ఇప్పుడు దీనిపై జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం సబ్ స్టేషన్ తండా గ్రామానికి చెందిన వాంకుడొత్ సుమన్ బాతులను సాదుకుంటున్నాడు. అయితే, తనకు, తన ఇంటిపక్కనున్న వారికి గతంలో పాత గొడవలు ఉన్నాయని.. ఆ కక్ష్యతోనే తాను సాదుకుంటున్న బాతులను వారు కొట్టి చంపారని ఆరోపిస్తూ శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. చనిపోయిన బాతులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఫిర్యాదు చేశాడు. ఏమైనప్పటికీ బాతు పంచాయతీ ఠాణాకు చేరడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.