వరంగల్‌లో వారిపై నిఘా పెట్టండి: సీపీ రవీందర్

by  |
వరంగల్‌లో వారిపై నిఘా పెట్టండి: సీపీ రవీందర్
X

దిశ, వరంగల్: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రౌడీషీటర్లు, భూకబ్జాదారుల కదలికలపై నిఘా పెట్టాలని వరంగల్ సీపీ రవీందర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై ఆధికారులు తక్షణమే స్పందించాలన్నారు. కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను ఫిర్యాదుదారుడికి అందజేయడంతో పాటు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. రాబోయే రోజుల్లో గంజాయి, గుట్కా, మట్కా, వ్యభిచారం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

Next Story