ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉన్నాయి: ఎల్జీ పాలిమర్స్

by  |
ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉన్నాయి: ఎల్జీ పాలిమర్స్
X

విశాఖపట్టణంలోని వెంకటాపురం పరిసర గ్రామాల్లో ప్రమాదానికి కారణమైన స్టైరిన్ లిక్విడ్ గడ్డకట్టి పాలిమర్ అయిందని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో లీక్ అయిన ట్యాంక్ నుంచి ఎలాంటి వాయువు బయటకు రావడం లేదని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ జీఎం మోహన్ రావు వెల్లడించారు. స్టెరిన్ లిక్విడ్‌ను ప్రమాదం సంభవించిన ట్యాంకు కాకుండా కంపెనీలో 2, విశాఖపోర్టులో 2 స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ ట్యాంకుల్లో ఉన్న స్టైరిన్ లిక్విడ్ ను వెనక్కి పంపే ఆలోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు. దీంతో ప్రమాదంపై కాస్త ఆందోళనలు తగ్గినట్టైంది.

Next Story