భావోద్వేగానికి’ బిల్ వేసిన ఆస్పత్రి

by  |
భావోద్వేగానికి’ బిల్ వేసిన ఆస్పత్రి
X

దిశ, ఫీచర్స్ : సామాన్యుడు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలంటేనే జంకుతాడన్నది జగమెరిగిన సత్యం. తలనొప్పి అంటూ వెళ్లినా సరే నానా రకాల పరీక్షలు చేసి, ప్రిస్కిప్షన్ మొత్తం మందులతో నింపేసి యాభై వేల వరకు బిల్ వేయడం పరిపాటే. అయితే బెడ్ చార్జీలు, స్పెషల్ డాక్టర్ ఫీజు, ఐసీయూ, అనస్థీషియా, ఫిజికల్ సర్జన్, నర్స్ వంటి పేర్లతో రకరకాల చార్జీలు బిల్లులో వేస్తుండటం సర్వసాధారణం కానీ ఆపరేషన్ సమయంలో ఏడిస్తే కూడా చార్జీ చేయడం ఎక్కడైనా చూశారా? అమెరికాకు చెందిన ‘మిడ్జ్’ అనే యువతికి ఇటీవలే సర్జరీ జరగ్గా, బిల్లులో ‘బ్రీఫ్ ఎమోషన్’ పేరుతో ఓ ఆస్పత్రి యాజమాన్యం డబ్బులు వసూలు చేయడంతో షాక్‌కు గురైంది మిడ్జ్. ఆ విషయాలన్నీ ట్విట్టర్‌లో షేర్ చేసుకోవడంతో ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.

చిన్నారులే కాదు హాస్పిటల్ అంటే కొంతమంది పెద్దలు కూడా భయపడిపోవడం కామన్. ఇక సిరంజి చూస్తే చాలామంది హై ఫీవర్ తెచ్చేసుకుంటారు. అలాంటిది ‘ఆపరేషన్’ అంటే మరింత ఆందోళన చెందడం ఖాయం. ఈ క్రమంలోనే పుట్టుమచ్చను తొలగించుకునే ఓ చిన్న శస్త్రచికిత్సకు వెళ్లిన మిడ్జ్, సర్జరీ సమయంలో కన్నీరు కార్చింది. దీంతో ఆపరేషన్ చేసేటప్పుడు ‘బ్రీఫ్ ఎమోషన్’ చూపించినందుకుగానూ 11 డాలర్లు (సుమారు రూ. 817) బిల్లు వేసింది ఆస్పత్రి. అంతేకాదు దానికి 2.20 డిస్కౌంట్ కూడా ఇవ్వడం గమనార్హం. ఈ బిల్‌పై కొంతమంది నెటిజన్లు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గురించి తమ అభిప్రాయాలను పంచుకోగా, మరికొంతమంది తమకు జరిగిన శస్త్రచికిత్సల బిల్లుల గురించి తమ వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు.

సీపీటీ కోడ్

హెల్త్ కేర్ సిస్టమ్ (ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ)లో CPT కోడ్ 96127‌ (సంక్షిప్త భావోద్వేగ/ప్రవర్తనా అంచనా) 2015 ప్రారంభంలో అందుబాటులోకి వచ్చింది.సెంటర్ ఫర్ మెడికేర్ & మెడికేడ్ సర్వీసెస్ (CMS) ద్వారా ఇది ఆమోదం పొందగా, ప్రధాన బీమా కంపెనీలు ఈ సర్వీస్‌ను క్లెయిమ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాయి. అన్ని బీమా పథకాల్లో మానసిక ఆరోగ్య సేవలను చేర్చడానికి ACA( Affordable Care Act) సమాఖ్య ఆదేశంలో భాగంగా దీన్ని రూపొందించారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత న్యూ డయాగ్నోసిస్ లేదా సంక్లిష్ట వైద్య సమస్య, నొప్పి ఉన్న రోగులు, మాదకద్రవ్యాల దుర్వినియోగం ఉన్న పేషెంట్స్ లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు సీపీటీ కోడ్ ప్రకారం టెస్ట్‌లు నిర్వహిస్తారు. దీన్ని బిల్లింగ్‌లో చేర్చవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ‘బ్రీఫ్ ఎమోషన్/బిహేవియరల్ అసెస్‌మెంట్’ అనేది డిప్రెషన్ లేదా అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ వంటి పరీక్షల కోసం వినియోగిస్తారు.

అయితే ‘అసెస్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి బాధ్యత వైద్యులదే కాగా రోగులు భావోద్వేగాన్ని ప్రదర్శిస్తే వాటిని పరీక్షించాల్సిన అవసరం లేదు. పేషెట్ ఏడుపు వంటి భావోద్వేగాన్ని ప్రదర్శించినందున కోడ్ 96127 నివేదించబడదు. ఎన్‌కౌంటర్ ఆధారంగా ఏదైనా ఎమోషనల్/బిహేవియరల్ అసెస్‌మెంట్ సంభవిస్తే, అది రోగిని సంప్రదించి, వైద్యుడు తీసుకున్న క్లినికల్ నిర్ణయంగా పరిగణిస్తారు.

చార్జ్ చేయొచ్చా?

మానసిక ఆరోగ్య స్క్రీనింగ్ వెబ్‌సైట్ కనెక్టెడ్ మైండ్ ప్రకారం, ఏదైనా అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ నిపుణుడు CPT 96127 కోసం చార్జ్ చేయవచ్చు. మెడికేర్ యావరేజ్ ప్రకారం యూనిట్‌కు $ 4.89 (జూలై 2021 నాటికి)గా నిర్ధారించారు. ఇది ప్రివేంటేటివ్ సర్వీస్ కాగా నెవాడా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ రూపొందించిన ఫాక్ట్ షీట్ ప్రకారం, తీవ్రమైన అనారోగ్యం లేదా ఫాలో-అప్ విజిట్‌లో భాగంగా స్క్రీనింగ్ కూడా చేయవచ్చు. CPT 96127 ఇతర సాధారణ సేవల మాదిరిగానే అదే తేదీన బిల్లు చేయబడుతుంది ప్రైమరీ కేర్‌లో భాగంగా నిపుణులు CPT కోడ్ 96127 ను వారి రోగులను పరీక్షించేటప్పుడు, వ్యాధిని అంచనా వేసేటప్పుడు ఏడాదికి నాలుగు సార్లు దీన్ని నిర్వహించవచ్చు.

ఇది ఏ మానసిక ఆరోగ్య పరిస్థితులను కవర్ చేస్తుంది?

ADHD, డిప్రెషన్, ఆత్మహత్య ప్రమాదం, ఆందోళన, సోమాటిక్ సింప్టమ్ డిజార్డర్, మాదకద్రవ్య దుర్వినియోగం కోసం సంక్షిప్త అంచనాను నివేదించడానికి దీనిని ఉపయోగిస్తారు. సంవత్సరానికి 4 సార్లు బిల్ చేయవచ్చు, ఒక్కో సందర్శనకు గరిష్టంగా 4 వేర్వేరు స్క్రీన్‌లు ఉంటాయి.

Next Story

Most Viewed