దుర్గగుడిలో నేడు, రేపు వీఐపి దర్శనాలు రద్దు.. ఎందుకంటే..?

by  |
దుర్గగుడిలో నేడు, రేపు వీఐపి దర్శనాలు రద్దు.. ఎందుకంటే..?
X

దిశ, ఏపీ బ్యూరో: దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి భక్తకీలాద్రిగా మారిపోయింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. విజయదశమి పండుగనాడు కూడా భక్తులు ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. భక్తులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో క్యూలైన్లు రద్దీగా మారాయి. భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. రెండు రోజులపాటు వీఐపి దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. శని, ఆదివారాల్లో వీఐపి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు సాధారణ భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed