తెలంగాణ రహదారులపై కేంద్రం సవతి ప్రేమ

by  |
తెలంగాణ రహదారులపై కేంద్రం సవతి ప్రేమ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రహదారులపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుందని ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. గురువారం లోక్‌సభ ఎంపీ నామా నాగేశ్వరరావుతో భేటీ అయిన వినోద్‌కుమార్.. రాష్ట్రానికి చెందిన 4-6 లైన్ల జాతీయ రహదారులకు మోక్షం కలిగేలా ఒత్తిడి పెంచాలని కోరారు. విభజన చట్టంలో చెప్పినట్లుగా నేషనల్‌ హైవేల విస్తరణకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.

కరీంనగర్-వరంగల్ మధ్య నాలుగు, ఆరులైన్ల జాతీయ రహదారి, జగిత్యాల-కరీంనగర్, ఆర్మూర్-జగిత్యాల-రామగుండం, కరీంనగర్-గడ్చిరోలి, ఖమ్మం-దేవరపల్లె, మంచిర్యాల-వరంగల్, ఖమ్మం-విజయవాడ, వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-మన్నెగూడ, దేవసాగర్-మరికల్-జడ్చర్ల, కోదాడ-ఖమ్మం జాతీయ రహదారులు తక్షణమే మంజూరు కావాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం ఐదేళ్లలో కేవలం 126కిలోమీటర్ల మేరకు మాత్రమే నాలుగు లైన్ల రోడ్లు వేశారని, జాతీయ రహదారుల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని చెప్పడానికి ఇదే తాజా ఉదాహరణ అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed