99ఏళ్ల లీజ్‌కు బెజవాడ రైల్వే‌స్టేషన్.. భగ్గుమన్న కార్మిక సంఘాలు

by  |
99ఏళ్ల లీజ్‌కు బెజవాడ రైల్వే‌స్టేషన్.. భగ్గుమన్న కార్మిక సంఘాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రంలోని బీజేపీ సర్కార్ వీలైనంత త్వరగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏయిర్ పోర్టులు, రైల్వేలు, పబ్లిక్ సెక్టార్ లలో ప్రైవేటును ప్రోత్సహిస్తున్న కేంద్రం.. తాజాగా విజయవాడ రైల్వే స్టేషన్‌ను 99ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థకు లీజుకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

దీనిపై రైల్వే కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. రైల్వే ప్రైవేటీకరణ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రైల్వేస్టేషన్లను ప్రైవేటుకు కట్టబెట్టడాన్ని ఆపకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కేంద్రాన్ని హెచ్చరించింది. ఇదిలాఉండగా, రైల్వేస్టేషన్లను ప్రైవేటీకరణ చేస్తే రేట్లు భయంకరంగా పెరుగుతాయని యూనియన్ నానాయకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికైనా కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని సీపీఎం నాయకుడు మధు హెచ్చరించారు.



Next Story

Most Viewed