ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కంపెనీయే దోషి : విజయసాయిరెడ్డి

by  |
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కంపెనీయే దోషి : విజయసాయిరెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో : విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ దుర్ఘటన కేవలం కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే చోటుచేసుకుందని చెబుతూ పూర్తి నివేదికను హైపవర్ కమిటీ ఏపీ ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా స్పందిస్తూ, ‘విశాఖ గ్యాస్ లీక్ కేసులో హై పవర్ కమిటీ నివేదిక వచ్చాక పచ్చ బ్యాచ్ నోళ్లు మూతపడ్డాయి. కంపెనీదే తప్పని నిపుణులు తేల్చారు. తప్పు ఎవరు చేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందే సీఎం జగన్ స్పష్టం చేశారన్నారు. కమిటీ ఇచ్చిన సూచనలను తప్పక పాటించారు కాబట్టే పారదర్శకంగా నివేదికను జనం ముందుంచారు’ చెప్పారు.

మరో ట్వీట్‌లో ‘జగన్ ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే.. నిరసనలకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్‌లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం.. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం.. ఇంకెంత దిగజారతావు బాబూ ? 2024లో నీ అడ్రస్ గల్లంతే’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై ఎంపీ తీవ్ర విమర్శలు చేశారు.



Next Story

Most Viewed