ఇస్మార్ట్.. కోతి ఏం చేసిందో తెలుసా

by  |
ఇస్మార్ట్.. కోతి ఏం చేసిందో తెలుసా
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు జంతువులు, పక్షులు అడవిలోనే ఉండేవి కానీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అవి మారుతున్నాయి… ఇప్పటి వరకు మనం చాలా వీడియాల్లో చూసుటాం చిలక పెయిటింగ్ వేయడం, కుక్కలు సిస్టమ్ ఆపరేట్ చేయడం అలానే ఓ కోతి వీడియో గేమ్ ఆడుతుంది. కోతి వీడియో గేమ్ ఆడటం ఏంటీ అనుకుంటున్నారా అవును.. ఇస్మార్ట్ శంకర్ సినిమాలోలాగ రామ్ కి చిప్ అమరిస్తే ఎలా ఆఫిసర్ గా మారుతాడో .. కోతి మెదడులో చిప్ చేర్చడం ద్వారా అది అచ్చం మనిషిలానే ప్రవర్తిస్తుదంటా.

టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ ఆవిష్కరించిన పాంగ్ గేమ్ చిప్ ని మకాక్ జాతికి చెందిన పాజెర్ మెదడులో అమర్చారు. దీంతో కోతి అచ్చం మనిషిలానే వీడియో గేమ్ ఆడుతుంటే..దానిని వీడియో తీసి యూ ట్యూబ్ లో పోస్టు చేశారు. అందులో కోతి ఓ దానిపై ఎక్కి అచ్చం మనిషిలాగే గేమ్ ఆడుతూ కనిపిస్తుంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనం ఎదైనా ఆటలు ఆడినప్పుడు స్నాక్స్ ఎలా తీసుకుంటామో ఈ కోతి కూడా కొద్దిసేపు ఆడిన తర్వాత ఓ అరటిపండును తొక్క తీసుకుంటూ తినేయడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ కోతిలో చిప్ అమర్చడం మూలంగా జాయ్ స్టిక్ ఎలా కదుపుతూ ఆటలో ఎలా అయితే నెగ్గుతామో తెలుసుకుని ఆవిధంగానే ఆడుతుంది. ఎవరైనా పక్షవాతం వస్తే అలాంటి వారు ఈ చిప్ ద్వారా మాములు మనుషుల కంటే వేగంగా స్మార్ట్ ఫోన్ వాడే సదుపాయం కల్పించగలమంటున్నాడు ఎలన్ మస్క్.



Next Story

Most Viewed