వ్యాక్సిన్ తయారీ హబ్‌గా భారత్ : ఉపరాష్ట్రపతి

by  |
వ్యాక్సిన్ తయారీ హబ్‌గా భారత్ : ఉపరాష్ట్రపతి
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో వ్యాక్సిన్ తయారీ రంగంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ప్రపంచ వ్యాప్తంగా ఇమ్యునైజేషన్ కార్యక్రమాల కోసం వినియోగించే 60 శాతం టీకాలు భారత్‌లో తయారవుతున్నాయని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ తన ప్రభావాన్ని చూపుతోంది.

ఆ మమహ్మరి బారిన పడి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరూ చికిత్స అనంతరం కోలుకున్నారు. సమీప భవిష్యత్తులో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచియున్న నేపథ్యంలో ఇండియాలో 30కు పైగా దేశీయ టీకాలు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. అందులో మూడు కంపెనీలు మాత్రం అధునాతన దశకు చేరుకున్నాయని వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు తెలిపారు.


Next Story