ONV కాంట్రవర్సీ… అవార్డు తిరిగిచ్చేసిన రచయిత

by  |
ONV కాంట్రవర్సీ… అవార్డు తిరిగిచ్చేసిన రచయిత
X

దిశ, సినిమా : ప్రముఖ తమిళ్ లిరిసిస్ట్ వైరముత్తుపై సింగర్ చిన్మయి శ్రీపాదతో పాటు 17 మంది మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2018లో మీటూ ఉద్యమ సమయంలో సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమం కూడా నడిచింది. అయితే అలాంటి వ్యక్తికి మలయాళం ఇండస్ట్రీకి చెందిన రచయిత, కవి ఓఎన్వీ కురుప్ పేరు స్మారకార్థం అందిస్తున్న ఓఎన్వీ అవార్డును అందించడంపై తమిళ, మలయాళం ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యతిరేకించారు. దీంతో జ్యూరీ దీనిపై పున:పరిశీలన చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ క్రమంలో తన అవార్డును వెనక్కిచ్చేస్తున్నట్లు ప్రకటించాడు వైరముత్తు. జ్యూరీని ఇబ్బంది పెట్టడం తనకిష్టం లేదని, వివాదాల మధ్య అవార్డు తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. తాను చాలా నిజాయితీగా ఉన్నానని, తన నిజాయితీని ఎవరూ ధృవీకరించాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఓఎన్వీ అవార్డు కింద ఇచ్చిన రూ.3లక్షల నగదు బహుమతిని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తానని తెలిపాడు. కేరళ, మలయాళీల పట్ల సోదరాభావాన్ని పెంచేందుకు గాను వ్యక్తిగతంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 లక్షల విరాళం ఇస్తున్నట్లు వివరించాడు. తనకు అవార్డు వచ్చిందని శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు అభిమానులు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపాడు.



Next Story

Most Viewed