ప్రేమించడం మానేస్తే నా జీవితం ముగిసిపోయినట్లే.. సల్మాన్ ఖాన్ రాసిన లవ్ లెటర్ వైరల్.. ఎవరికో తెలిస్తే షాక్ అవుతారు..

by Dishafeatures3 |
ప్రేమించడం మానేస్తే నా జీవితం ముగిసిపోయినట్లే.. సల్మాన్ ఖాన్ రాసిన లవ్ లెటర్ వైరల్.. ఎవరికో తెలిస్తే షాక్ అవుతారు..
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు. 60ఏళ్ల వయసులోనూ హీరోగా యాక్సెప్ట్ చేయబడుతున్నాడు. అందుకు తగినట్లుగా ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తున్నాడు. కానీ పెళ్లికి మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. ఇక చేసుకుంటాడో లేదో కూడా అనుమానమే. కానీ ఆయన ఎకౌంట్ లో లవ్ స్టోరీస్ కు మాత్రం కొదువలేదు. ఒకప్పుడు ఐశ్వర్యా రాయ్ ను ప్రేమించిన ఆయన.. పోసెసివ్ నెస్ తో ఆమెను దూరం చేసుకున్నాడు. ఈ కోపంతో ఆమె పోలికలతో ఉన్నా స్నేహా ఉల్లాల్ ను హీరోయిన్ గా పరిచయం చేశాడు. తర్వాత కత్రినా కైఫ్ ను లైన్ లో పెట్టాడు కానీ అది కూడా వర్క్ ఔట్ కాకపోవడంతో ఆమె మాదిరిగా ఉన్నా జరీనా ఖాన్ ను ఇంట్రడ్యూజ్ చేశాడు. అనంతరం ఓ హాలీవుడ్ నటితో ప్రేమాయణం అన్నారు కానీ ఎటూ తేలలేదు. కాగా అంతకు ముందే మరో ఇద్దరు హీరోయిన్స్ తో కూడా రిలేషన్ ఉన్నట్లు టాక్.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన స్వయంగా చేతితో రాసిన ప్రేమ లేఖ వైరల్ అవుతుంది. కానీ అది అభిమానులకు కావడం విశేషం. ' మైనే ప్యార్ కియా 'తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయనకు ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అందుకే తనను ఇంత గొప్పగా ఆదరించిన ఆడియన్స్ కు బహిరంగ లేఖ రాశాడు. 'మీరు రాబోయే సినిమాలను ఈ మూవీతోనే పోల్చుతారని తెలుసు. అందుకే జాగ్రత్తగా ఎంచుకుంటా. మీ ప్రేమను మళ్లీ మళ్లీ పొందుతా. మీరు అదరించని రోజున నా కెరీర్ ముగుస్తుందని నాకు తెలుసు. కష్టపడి పని చేస్తా. మిమ్మల్ని ఒప్పిస్తా ' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ అవుతుండగా.. ఆయన డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీకి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story