మోడీ అయోధ్య కడితే.. కేసీఆర్ యాదాద్రి నిర్మించారు: KTR

by Disha Web Desk 2 |
మోడీ అయోధ్య కడితే.. కేసీఆర్ యాదాద్రి నిర్మించారు: KTR
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తిలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు 12 ఎంపీ సీట్లు ఇస్తే.. గుంపు మేస్త్రీ ఇంటికి వెళ్లడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. నమో అంటే.. నమ్మించి మోసం చేయడమే అని అన్నారు. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి మోడీ మోసం చేశారని విమర్శించారు. కృష్ణా జలాల్లో పదేళ్లుగా తెలంగాణ వాటాను మోడీ తేల్చకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు.

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదని విమర్శించారు. ఏం అడిగినా అయోధ్యలో రాముడి గుడి కట్టామని మోడీ చెబుతున్నారు. కేసీఆర్ అద్భుతంగా యాదాద్రి ఆలయం నిర్మించలేదా? అని ప్రశ్నించారు. ఎంతో గొప్పగా నిర్మించినా ఏనాడూ యాదాద్రి ఆలయాన్ని తాము రాజకీయంగా వాడుకోలేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ గెలిస్తే పెట్రోల్ రేటు రూ.400 దాటడం ఖాయమని జోస్యం చెప్పారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే.. దేశంలో మోడీ సుంకాలు పెంచారని గుర్తుచేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు. మోడీ, అదానీ వంటి వారికి రూ.40 వేల కోట్ల రుణాల మాఫీ చేశారని తెలిపారు.

Read More...

ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.. మంత్రి ఉత్తమ్ భరోసా

Next Story