నో ప్రాపిట్… నో లాస్ పేరుతో టీకా అందజేయాలి

by  |
Boora Narsaiah Goud
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా ఉధృతి నేపథ్యంలో టీకా కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానలు నో ప్రాపిట్.. నో లాస్ పేరిట టీకా అందజేయాలని డాట్ చైర్మన్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. బుధవారం టీఎస్‌హెచ్ఏ చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ రెమిడిసివిర్, కోవాగ్జిన్, కోవిషిల్డు టీకాలతో కొవిడ్ తగ్గుతుందని తెలిపారు.

ఫస్ట్ డోస్‌తో 64 శాతం… సెకండ్ డోస్‌తో 94 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ప్రైవేటా, ప్రభుత్వమా అని కాకుండా ఎక్కడ వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా నుంచి విముక్తి కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ధర నిర్ణయించినప్పటికీ ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానాలు లాభాపేక్ష లేకుండా ప్రజలకు వ్యాక్సిన్ అందజేయాలని కోరారు.

డాక్టర్లు, ఆసుపత్రులు అంటే కేవలం డబ్బు వసూలు చేసుకునే వ్యాపార సంస్థలు కాకుండా ఒక సమాజసేవ చేసే సంస్థలుగా పేరుతెచ్చుకునేందుకు ఇది మంచి అవకాశం అన్నారు. అన్ని ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానలు సహకరించాలని, ప్రజలకు టీకాపై ప్రాపిట్ లేకుండా అందజేయాలని కోరారు.



Next Story

Most Viewed