ఏడాది చివరికల్లా వయోజనులందరికీ టీకా!

by  |
ఏడాది చివరికల్లా వయోజనులందరికీ టీకా!
X

న్యూఢిల్లీ: వయోజనులకు టీకా పంపిణీ ప్రారంభించినా డోసుల కొరతతో నత్తనడక సాగుతున్నది. ఉత్పత్తిదారులూ డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చివరికల్లా 267 కోట్ల డోసులను కేంద్రం కొనుగోలు చేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అంచనా వేశారు. అంటే, ఏడాది చివరికల్లా దేశంలోని కనీసం వయోజనులందరికీ టీకా వేసే పొజిషన్‌లో ఉంటామని వివరించారు. జులైకల్లా 51కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని, ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 216 కోట్ల డోసులను కొనుగోలు చేస్తామని తెలిపారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లందరికీ ముందుగా టీకా పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు సూచించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ బుధవారం బెంగాల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో ఆన్‌లైన్‌లో భేటీ అయ్యారు.

Next Story

Most Viewed