మహిళకు నిమిషాల వ్యవధిలో మూడు డోసుల వ్యాక్సిన్.. ఆపై

by  |
మహిళకు నిమిషాల వ్యవధిలో మూడు డోసుల వ్యాక్సిన్.. ఆపై
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఇప్పటికే ఒక మహిళకు రెండు వేర్వేరు డోసులు ఇచ్చిన ఘటన మరవకముందే మరో మహిళకు నిమిషాల వ్యవధిలోనే మూడు డోసులు వేసిన ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. ఠాణె ప్రాంతానికి చెందిన ఓ 28ఏళ్ల మహిళ గత శుక్రవారం తన భర్తతో కలిసి స్థానిక టీకా కేంద్రానికి టీకా తీసుకోవడానికి వెళ్లింది. అక్కడ గంటల వ్యవధిలో మూడు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుంది. టీకా వేయించుకున్న అనంతరం నర్స్ తనకు మూడుసార్లు టీకా వేసినట్టు భర్తకు తెలిపింది. దీంతో భర్త థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ)లో పనిచేస్తుండడంతో వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేశాడు.

తన భార్య మొదటిసారి టీకా తీసుకోవడం వలన తనకి వీటిపై అవగాహనా లేదని, మూడు డోసులు ఒకేసారి ఇవ్వడంతో తన భార్యకు విపరీతంగా జ్వరం వచ్చిందని, మరుసటి రోజు తగ్గిపోయిందని తెలిపాడు. ఇక విషయం తెలుసుకున్న టీఎంసీ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఖుష్బూ తావ్డే బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, విషయం తెలిసిన వెంటనే బాధితురాలిని అబ్జర్వేషన్ లో పెట్టామని తెలిపారు. ఏది ఏమైనా వైద్యుల నిర్లక్ష్యం వలనే ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతున్నాయని, ఇలాంటివి ఆపడానికి కమిటీని ఏర్పాటు చేయాలనీ బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, కారకులపై చర్యలు తీసుకుంటామని మేయర్ నరేశ్ మెహస్కే హామీ ఇచ్చారు.


Next Story