యూపీ టు ఢిల్లీ రాకపోకలు బంద్.. పలు రాష్ట్రాల సరిహద్దులు బ్లాక్

by  |
యూపీ టు ఢిల్లీ రాకపోకలు బంద్.. పలు రాష్ట్రాల సరిహద్దులు బ్లాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత్ బంద్ కారణంగా దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జోరుగా కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, కొత్త వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారత్ బంద్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఘాజీపూర్ సరిహద్దు వద్ద రైతులు నిరసన వ్యక్తం చేస్తుండటంతో ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లే జాతీయ రహదారుల్లో ట్రాఫిక్‌‌కు భారీ అంతరాయం ఏర్పడింది. రైతులు రోడ్డు మొత్తం బ్లాక్ చేశారు.

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రైతు సంస్థలు కూడా ‘భారత్ బంద్’ కు మద్దతు ప్రకటించాయి. ఢిల్లీ-అమృత్ సర్ జాతీయ రహదారిపై హర్యానాలోని కురుక్షేత్ర షహాబాద్ వద్ద రైతులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో శంభు సరిహద్దు (పంజాబ్-హర్యానా సరిహద్దు) సాయంత్రం 4 గంటల వరకు బ్లాక్ చేసి ఉంటుందని ఒక రైతు తెలిపారు.


Next Story