ఇలాంటి దరిద్రపు పాలన ఎన్నడూ చూడలేదు: ఉత్తమ్

by  |
ఇలాంటి దరిద్రపు పాలన ఎన్నడూ చూడలేదు: ఉత్తమ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు కాలం దగ్గర పడిందని, ఇక కల్వకుంట్ల కంపెనీ ఇంటికి పోవాల్సిందేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. టీఆర్ఎస్​పాలనలో గ్రామ పంచాయితీలు నిర్వీర్యం అయ్యాయని, పాలకవర్గాలకు అధికారాలు లేవని, గ్రామాల్లో అభివృద్ధికి నిధుల్లేవని మండిపడ్డారు. పంచాయతీరాజ్​సత్యాగ్రహ దీక్ష ఇందిరాపార్కులో మంగళవారం టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ దీక్షలో ఉత్తమ్​మాట్లాడుతూ టీఆర్ఎస్​పాలన దుర్మార్గంగా మారిందని, గ్రామ ప్రజా ప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా చేశారని, కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ వేధిస్తోందని విమర్శించారు. ఇలాంటి దరిద్రపు పాలన ఎన్నడూ చూడలేదని, శాతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.

అధికార దుర్వినియోగం చేస్తున్నారు: భట్టీ
ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పంచాయితీలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేరుగా నిధులు ఇచ్చిందని, ఈ ప్రభుత్వం మాత్రం ట్రాక్టర్ల కొనుగోళ్లు, శ్మశానవాటికల నిర్మాణాలు, హరితహారాలు పనులు చేయించి పంచాయతీ నిధులు ఖర్చు చేయిస్తోందన్నారు. కాంగ్రెస్ సర్పంచులు ఉన్న దగ్గర కనీసం ప్రోటోకాల్ పాటించకుండా టీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారని, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ చెక్ పవర్ రద్దు చేస్తామని బెదిరిస్తోందని, పంచాయతీలకు హక్కుగా రావాల్సిన నిధులను కూడా రానీయడం లేదని ఆరోపించారు.

ఉనికి కోసం ఉద్యమించాలి : వీహెచ్​
తెలంగాణలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులను కేవలం నామమాత్ర నాయకులుగా చేశారని, వారి విధులు ఏమిటో కూడా తెలియని పరిస్థితి ఉందని మాజీ ఎంపీ వీహెచ్​ ఆరోపించారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఉద్యమించాలని, ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆత్మగౌరవం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు దీక్షలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులే అసలైన ప్రజా నేతలని, గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వడం లేదని, పార్టీ మారితే బిల్లులు ఇస్తామని టీఆర్‌ఎస్ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు.

Next Story

Most Viewed