‘స్వీయ నియంత్రణే ఏకైక మార్గం’

by  |
‘స్వీయ నియంత్రణే ఏకైక మార్గం’
X

దిశ, రంగారెడ్డి: కరోనాను కట్టడి చేయాలంటే స్వీయ నియంత్రణ పాటించడమే ఏకైక మార్గమని మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిరాశ్రయులను ఆదుకోవడం అభినందనీయమన్నారు. శైలజ థియేటర్‌లో పనిచేసే కార్మికులకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వెంకటరత్నం ఆధ్వర్యంలో కొంతమంది ఉపాధ్యాయులు, ఇతర రంగాల్లో ఉన్నవారు హెల్పింగ్ హ్యాండ్స్ వేదిక ద్వారా ఆదుకోవడం మంచి పరిణామమన్నారు. కరోనా కట్టడికి అన్ని రంగాలు, వర్గాల వారు సహకరిస్తున్నారని తెలిపారు. సామాజిక దూరం పాటించడంతో పాటు, మాస్కులు తప్పకుండా ధరించాలని అన్నారు. ఇంకొన్ని రోజులపాటు ఇంట్లోనే ఉండాలని కోరారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం మాట్లాడుతూ.. మావంతు సహకారంగా నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటిద్దామన్నారు.

Tags : UTF, distributed, essential commodities, poor people, rangareddy


Next Story