చైనాకు అమెరికా మరో షాక్

by  |
చైనాకు అమెరికా మరో షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : డ్రాగన్ కంట్రీకి అమెరికా మరో షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది. ప్రపంచమంతా కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడానికి చైనానే కారణమని అగ్రరాజ్యం అమెరికా ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన టిక్ టాక్ సహా అన్ని యాప్స్‌లను బాన్ చేసేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో స్పష్టం చేశారు. ఇప్పటికే భారత్ చైనాకు చెందిన 59యాప్స్‌ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే..అయితే, మన దేశం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతిస్తున్నామని పేర్కొనడమే కాకుండా, తాము కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అంతలోనే మైక్ పాంపియో ప్రకటన చైనాకు గట్టి షాక్ అని చెప్పుకొవచ్చు. కాగా, అమెరికాలో 25లక్షల మందికి పైగా కరోనా బారిన పడగా, లక్షకు పైగా మరణాలు సంభవించాయి. అంతేకాకుండా అగ్రరాజ్యం ఆర్థికంగా నష్టపోవడానికి డ్రాగన్ కంట్రీనే కారణమని, వైరస్‌ను చైనానే సృష్టించిందని అధ్యక్షుడు ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తున్నాడు. తాజాగా భారత్ బాటలోనే అమెరికా నడుస్తుండటంతో ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుందో వేచిచూడాలి.

Next Story

Most Viewed