1000 మంది చైనా విద్యార్థుల వీసాలు రద్దు

by  |
1000 మంది చైనా విద్యార్థుల వీసాలు రద్దు
X

వాషింగ్టన్: దాదాపు 1000 మందికి పైనే చైనా విద్యార్థులు, పరిశోధకుల వీసాలను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. చైనా ఆర్మీతో వారికి సంబంధాలున్నాయని, గూఢచర్యాన్ని నేరపుతున్నారన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు, పరిశోధకుల సహాయంతో అమెరికాలోకి చొరబడే చైనా మిలిటరీ వ్యూహాన్ని అడ్డుకోవడానికి కొంతమంది చైనీయుల వీసాలను రద్దు చేస్తున్నట్టు హోమ్‌లాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ చాద్ వోల్ఫ్ ఇటీవలే తెలిపారు.

జూన్ 1వ తేదీన డొనాల్డ్ ట్రంప్ సర్కారు తెచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే అప్పటి నుంచి వీసాల రద్దు ప్రక్రియ సాగుతోంది. తాజాగా, 1000 మందికిపైనే చైనా విద్యార్థులు, పరిశోధకుల వీసాలు రద్దు చేసినట్టు స్టేట్ డిపార్ట్‌మెంట్ ధ్రువీకరించింది. కాగా, అమెరికా నిర్ణయం జాతి వివక్షేనని చైనా ఆరోపించింది. చైనా విద్యార్థుల హక్కులను కాలరాసేలా అమెరికా చర్యలున్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ అన్నారు.


Next Story