దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభం

6

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ ప్రారంభం శుక్రవారం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిని ప్రారంభించారు. ఈ క్రమంలో సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో రూ.15,592 కోట్ల అంచనాలతో రూపొందించిన 61 ప్రాజెక్టులకు వీరిద్దరూ శంకుస్థాపన చేశారు. కాగా రూ.502 కోట్లతో 2.6 కిలోమీటర్ల పొడవుతో దుర్గగుడి ఫ్లైఓవర్‌ను 900 రోజుల్లో పూర్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… ఫ్లైఓవర్‌ ప్రారంభంతో బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని తెలిపారు.