‘మూడు నెలల్లో టీకా సిద్ధం’

by  |
‘మూడు నెలల్లో టీకా సిద్ధం’
X

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నిలువరించే టీకా మరో మూడు నెలల్లో సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ధీమా వ్యక్తం చేశారు. ఫిక్కి ఎఫ్ఎల్‌వో వెబినార్‌లో ఆయన గురువారం మాట్లాడుతూ.. మూడు-నాలుగు నెలల్లో కరోనా టీకా సిద్ధమవుతుందని, సైంటిఫిక్ డేటా ఆధారంగా కరోనా టీకా కోసం ప్రాధామ్యాలను రూపొందిస్తామని అన్నారు. సాధారణంగా టీకా ముందుగా వైద్య సిబ్బందికి, తర్వాత వయోధికులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వేస్తారని, దీనికి సంబంధించి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.

టీకా పంపిణీ, ట్రాకింగ్, ట్రేసింగ్ కోసం ప్రత్యేకంగా ఈ-వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయడానికి బ్లూప్రింట్ తయారుచేస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది 2021 శుభ సంవత్సరంగా నిలుస్తుందని ఆశాభావాన్ని ప్రకటించారు. వచ్చే ఏడాది జులై-ఆగస్టులోపు 40 నుంచి 50 కోట్ల డోసులను 25 నుంచి 30 కోట్ల మందికి అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వచ్చే ఏడాది మార్చ్-ఏప్రిల్‌లో చేయాల్సిన కార్యకలాపాల గురించి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు.

Next Story

Most Viewed