షాకింగ్.. మొక్కజొన్న తోటలో నగ్నంగా బాలిక.. ఏం జరిగింది.?

by  |
gang rape news
X

దిశ, వెబ్‌డెస్క్ : కాలకృత్యాల కోసం ఆరుబయటకు వెళ్లిన బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన కర్నాటకలోని చిత్రదుర్గలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. చిత్రదుర్గ జిల్లాలోని ఓ గ్రామంలో బాధితురాలి కుటుంబం నివసిస్తోంది. తమ ఇంటి నిర్మాణం జరుగుతున్న కారణంగా కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్న ఓ కమ్యూనిటీ భవనంలో నివసిస్తున్నారు. దీంతో, వారు అక్కడ వాష్ రూమ్ లేకపోవడంతో ఆరుబయటే కాలక‌ృత్యాలు తీర్చుకుంటున్నారు.

ఈ క్రమంలో బాధితురాలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. కంగరూ పడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకగా.. వారికి ఓ మొక్కజొన్న తోటలో బాలిక మృతదేహం నగ్నంగా కనిపించింది. అంతేకాకుండా బాలిక మృతదేహాంపై గాట్లను బాధితురాలి పేరెంట్స్ గుర్తించారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Next Story

Most Viewed