యూకే ప్రభుత్వంతో టాటా కంపెనీల చర్చలు విఫలం

by  |
యూకే ప్రభుత్వంతో టాటా కంపెనీల చర్చలు విఫలం
X

దిశ, వెబ్‌డెస్క్: యూకేలో ఉన్నటువంటి టాటా గ్రూపు(Tata Group)నకు చెందిన జాగ్వార్ లాండ్ రోవర్ (Jaguar Land Rover) కార్ల తయారీ కంపెనీ, స్టీల్ ప్లాంట్ సంక్షోభం కొనసాగుతున్నాయి. కరోనా ఇబ్బందుల్లో అక్కడి వ్యాపారాలను మూసేయడం తప్పించి వేరే మార్గం లేదని భావించిన కంపెనీ బెయిల్ ఔట్ ప్యాకేజీతో ఆదుకుంటే మేలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.

కొవిడ్-19 వల్ల సంస్థలు తీవ్రమైన నష్టాలను మూటగట్టుకున్నాయని, యూరోపియన్ యూనియన్ (European Union) నుంచి బ్రిటన్ తప్పుకోవడం కూడా కంపెనీలపై అధిక ప్రభావం చూపించాయని తెలిపింది. ఉద్యోగులకు కనీసం జీతాలను చెల్లించలేని స్థితిలో ఉన్నట్టు కంపెనీ అక్కడి ప్రభుత్వాని కోరింది. యూకేలోని ప్లాంట్‌లో 50 శాతం వాటాను ప్రభుత్వానికి కేటాయిస్తామని, దీనికి బదులుగా సుమారు రూ. 8,600 కోట్లను అందించాలని కంపెనీలు కోరాయి.

ఈక్విటీ వాటా (Equity share)ను తీసుకోవాలని టాటా స్టీల్ కంపెనీ (Tata Steel Company) ప్రతిపాదనలు పంపింది. అయితే, ఇటీవల యూకే ప్రభుత్వం (UK Government) కంపెనీల ప్రతిపాదనలను తిరస్కరించినట్టు తెలుస్తోంది. యూకేలోని పన్ను చెల్లింపుదారుల నగదును టాటా స్టీల్ (Tata Steel) కంపెనీకి ఇవ్వడం కుదరదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అలాగే, జాగ్వార్ కంపెనీ డీజీల్ కార్లను ఉత్పత్తి చేయడం తగ్గించలేదని, ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి కూడా పెట్టలేదని అందుకే ప్యాకేజీ ఇచ్చేందుకు నిరాకరించినట్టు యూకే ప్రభుత్వం వెల్లడించింది.



Next Story

Most Viewed