నగరంలో బెజవాడ, గుంటూరుకు చెందిన ఇద్దరు మిస్సింగ్..

85

దిశ, జవహర్ నగర్ : జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం సీఐ బిక్షపతి రావు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని నైజాంపేట్ కాలనీకి చెందిన ప్రియాంక(25)కు పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ దొండ తోటకు చెందిన రవి (32)తో గత నెల 9న వివాహం జరిగింది.అప్పటి నుండి ఇద్దరు నవ దంపతులు జవహర్ నగర్ దొండ తోటలో నివాసం ఉంటున్న క్రమంలో ఈనెల 13న ప్రియాంక(25) ఇంట్లో నుండి ఎవ్వరికీ చెప్పకుండా అదృశ్య మైంది. దీంతో ఆమె భర్త రవి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రి కోసం కుమారుడి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని చిలుకలూరి పేటకు చెందిన ఈదుపల్లి వెంకట సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్ 120లో నివాసం ఉంటున్నారు. భవన నిర్మాణాల కోసం రోజువారీ పని నిమిత్తం ఈనెల 9న ఇంట్లో నుండి తన కారులో వెళ్ళారు. నేటికి తిరిగి ఇంటికి రాకపోవడంతో సత్యనారాయణ కుమారుడు వెంకట సాయి రాకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..