కేరళలో రెండు రోజుల సంపూర్ణ లాక్‌డౌన్

by  |
కేరళలో రెండు రోజుల సంపూర్ణ లాక్‌డౌన్
X

తిరువనంతపురం: కేరళలో కరోనా పరిస్థితులను సమీక్షించిన తర్వాత రెండు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తు్న్నది. ఈ తరుణంలో 17వ, 18వ తేదీల్లో ఆంక్షలు అమలు చేయనున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రకటించిన నిబంధనలే ఈ రెండు రోజుల లాక్‌డౌన్‌కు వర్తిస్తాయని తెలిపింది.

బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ రెండు రోజుల్లో మూసే ఉంటాయని పేర్కొంది. ఇది వరకు గుర్తించినట్టు ఏబీసీడీ కేటగిరీల్లోనే షాపులు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయని వివరించింది. మంగళవారం రాష్ట్రంలో 14,539 కొత్త కేసులు, 124 మరణాలు చోటుచేసుకున్నాయి. కరోనా పరిస్థితులపై కేరళ సహా ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ శుక్రవారం వర్చువల్ కాన్ఫరెన్స్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed