తక్కువ కాలంలో లక్ష అమ్మకాల రికార్డును సాధించిన టీవీఎస్ స్కూటర్

by  |
తక్కువ కాలంలో లక్ష అమ్మకాల రికార్డును సాధించిన టీవీఎస్ స్కూటర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ సరికొత్త రికార్డును సాధించింది. కంపెనీకి చెందిన ఎన్‌టీఓఆర్‌క్యూ 125 మోడల్ స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాలతో ఈ రికార్డును సాధించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మోడల్ స్కూటర్ దక్షిణాసియాతో పాటు పశ్చిమాసియా, లాటిన్ అమెరికాల్లోని 19 దేశాల్లో అమ్మకాలు జరిగాయని కంపెనీ పేర్కొంది. ‘కంపెనీ నుంచి సరికొత్త టెక్నాలజీతో వచ్చిన ఎన్‌టీఓఆర్‌క్యూ 125 మోడల్ స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లో లక్ష యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో కొత్త జనరేషన్ వినియోగదారులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ అధునాతన రైడింగ్, కొత్త సాంకేతికత, మెరుగైన పనితీరుతో చాలామందిని ఆకర్షించినట్టు’ టీవీ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈఓ కె ఎన్ రాధాకృష్ణన్ చెప్పారు. వినియోగదారుల ఆకాంక్షలకు తగినట్టు కొత్త ఆవిష్కరణలను టీవీఎస్ ఎన్‌టీఓఆర్‌క్యూ బ్రాండ్ ద్వరా అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. రేసింగ్ సపోర్ట్, రేసింగ్ ట్యూన్‌డ్ ఇంజిన్ పనితీరు ఈ మోడల్ రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించడానికి కారణమని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా సరికొత్త సాంకేతికతతో రూపొందించిన ఈ మోడల్‌లో స్మార్ట్‌ఫోన్‌లోని బ్లూటూత్ ద్వారా స్కూటర్‌కు కనెక్ట్ చేయవచ్చని, నేవిగేషన్ అసిస్టెంట్, ఇంటర్నల్ ల్యాప్ టైమర్ సహా అనేక ఫీచర్స్ ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed