మంగళవారం పంచాంగం, రాశి ఫలాలు (06-04-2021)

176
Panchangam
Panchangam

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం బహుళ పక్షం
తిధి : నవమి ఉ 5.58వరకు
తదుపరి దశమి తె5 .04
వారం : మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం : శ్రవణం తె 5.23
యోగం : సిద్ధం సా 6.35
తదుపరి సాధ్యం
కరణం : గరజి ఉ 5.58
తదుపరి వణిజ సా 5.31
ఆ తదుపరి భద్ర/విష్ఠి తె 5.04
వర్జ్యం : ఉ 9.39 – 11.14
దుర్ముహూర్తం : ఉ 8.22 – 9.11 &
రా 10.52 – 11.39
అమృతకాలం: రా 7.07 – 8.41
రాహుకాలం : మ 3.00 – 4.30
యమగండం/కేతుకాలం: ఉ9.00 – 10.30
సూర్యరాశి: మీనం || చంద్రరాశి : మకరం
సూర్యోదయం: 5.56 || సూర్యాస్తమయం: 6.10

(06-04-2021) రాశి ఫలితాలు

మేషం

​నూతనోత్సాహంతో పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

వృషభం

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. బంధువుల నుండి ఊహించని వ్యతిరేకత పెరుగుతుంది. వ్యాపారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మిధునం

సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం

నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు నుండి ఆశించిన సహాయం అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరణకు అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులు ఆదరణ కలిగి హోదాలు పెరుగుతాయి.

సింహం

నూతన ఆలోచనలను అమలు చేస్తారు. దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలు సర్దుమణుగుతాయి. నూతన వస్త్ర వస్తులాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగ విషయమై ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని సమస్యలను అధిగమిస్తారు.

కన్య

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఒక వ్యవహారంలో ప్రభుత్వ సంభందిత జరిమానాలు కట్టవలసి రావచ్చు. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి.

తుల

వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగులకు ప్రయత్నాలు విఫలం అవుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగును. ఆలోచన లో స్థిరత్వం లేక వ్యతిరేక ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఒడిదుడుకులు కలిగి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

వృశ్చికం

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగము సఖ్యతగా వ్యవహరించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

ధనస్సు

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకా చికాకు పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి అందిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది.బంధు మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మకరం

ఆత్మీయులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది నూతన వ్యాపారాలు రాణిస్తాయి ఉద్యోగులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

కుంభం

ముఖ్యమైన వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనవసరం విషయాలపై ధన వ్యయం చేస్తారు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దైవదర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమ ఫలితాలుంటాయి ఉద్యోగ విషయంలో స్థానచలన సూచనలు ఉన్నవి.

మీనం

నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..